‘Hari Hara Veera Mallu’ పై Pawan Kalyan కు ఇన్‌ట్రెస్ట్ లేదు..! క్లారిటీ ఇచ్చిన మూవీ నిర్మాత

by sudharani |   ( Updated:2023-09-05 03:42:30.0  )
‘Hari Hara Veera Mallu’ పై Pawan Kalyan కు ఇన్‌ట్రెస్ట్ లేదు..! క్లారిటీ ఇచ్చిన మూవీ నిర్మాత
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవర్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే అటూ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇందులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ ఒకటి. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసి దాదాపు నాలుగేళ్లు పూర్తవుతున్నా చిత్రం మాత్రం తెరకెక్కడం లేదు. దీంతో ఈ మూవీ పట్ల పవన్ కల్యాణ్ ఆసక్తి చూపించడం లేదని.. అందుకే షూటింగ్ ఆలస్యం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ సినిమాపై ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం స్పందిస్తూ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు.

‘‘హరిహర వీరమల్లు చాలా పెద్ద సినిమా. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఒకేసారి ఆయన అన్ని డేట్స్ ఇచ్చినా ఆ సినిమాని పూర్తి చేయలేం. ఇది రెగ్యులర్‌గా తీసే సినిమా కాదు.. పెద్ద మూవీ కాబట్టి చాలా సినీ సెట్స్ వేయాలి, గ్రాఫిక్స్ చేయాలి. తక్కువ టైం ఉన్న సినిమాలను పవన్ కళ్యాణ్ ముందు చేసుకుంటూ వెళ్తున్నారు. తప్పకుండా ఎలక్షన్స్‌కు ముందే హరిహర వీరమల్లును పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అని ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం తెలిపారు. ఈ వార్తతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ జోష్‌లో మునిగిపోయారు. అతి త్వరలోనే హరిహర వీరమల్లు థియేటర్లలోకి రాబోతుందని సంబురపడిపోతున్నారు.

Advertisement

Next Story