పొలిటికల్ ఎంట్రీపై ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2023-04-04 14:06:30.0  )
పొలిటికల్ ఎంట్రీపై ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో సినీ గ్లామర్ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఇటీవల పలువురు టాప్ హీరోలను బీజేపీ పెద్దలు కలవడం హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత మరి కొందరు ఇతర పార్టీలకు మద్దతు ప్రకటించడం చర్చగా మారింది. ఈ క్రమంలో టాప్ ప్రొడ్యూసర్‌లలో ఒకరైన దిల్ రాజ్ పొలిటికల్ ఎంట్రీపై జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దిల్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

‘తనకు రాజకీయాల్లోకి రావాలని ఆఫర్లు వస్తున్నాయి. కానీ, రాను.. సినిమా జీవితంలోనే నన్ను విమర్శిస్తుంటే తట్టుకోలేకపోతున్నా. ఇంకా రాజకీయాల్లో వచ్చాక తట్టుకోగలనా’ అనే అర్థంలో ఆయన చేసిన వాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. అంతే కాక తాను రాజకీయాల్లో వస్తానా రానా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం అంటూ ఈ అంశంపై దాటవేసే ప్రయత్నం చేశారు. దీంతో దిల్ రాజ్ పొలిటికల్ ఎంట్రీ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.


Advertisement

Next Story