- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రికార్డులన్నీ బద్దలవుతయ్.. పవన్ కల్యాణ్ ‘OG’పై హైప్ పెంచిన నిర్మాత దానయ్య!
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓటీ(OG). ఇది పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ప్రభాస్‌తో సాహో సినిమా తీసిన యంగ్ డైరెక్టర్ ఓజీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డీవీవీ దానయ్య ఓజీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు ఒక్క పోస్టర్ కూడా విడదల కాలేదు.. అయినా రోజూ ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉంటోంది. చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ రోల్‌లో నటిస్తుండటంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతేగాక, వరుస రీమేక్‌ల తర్వాత పవన్ నటిస్తున్న డైరెక్ట్ సినిమా. దీంతో ఈ చిత్ర అప్‌డేట్‌ల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2nd) సమీపిస్తుండటంతో ఓజీ నుంచి టీజర్ వస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాత దానయ్యకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లతో ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా.. ఓ అభిమాని ‘‘మైండ్ పనిచేయట్లేదు.. సినిమా గురించి ఏదో ఒక అప్డేట్’’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి చిత్ర నిర్మాత దానయ్య స్పందించారు. ‘‘రేయ్ ఆగండి.. అన్ని పోతాయ్’’(రికార్డులన్నీ బద్దలు అవుతాయ్) అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో టీజర్ కోస వేయి కళ్లతో ఎదురుచూస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ సినిమాలో పవన్ సరసన తమిళ నటి ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. మరో తమిళ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు.