- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun: ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా ఉంటాడు.. అల్లు అర్జున్‌పై నిర్మాత కామెంట్స్
దిశ, సినిమా: యంగ్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన సినిమా ‘ఆయ్’. ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమాకు నూతన దర్శకుడు అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించాడు. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ మూవీ.. ఈరోజు (ఆగస్టు 15)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా.. నిర్మాత బన్నీ వాసు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించాడు.
ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘‘ఆయ్’ ప్రమోషన్స్ సరిగ్గా జరగడం లేదని.. అల్లు అర్జున్‌కు చెప్పిన మా సినిమా గురించి ఓ పోస్ట్ చెయ్యమని అడగాలని మా టీమ్ నన్ను కోరారు. కానీ మేము అడగకుండానే.. ఆయనే ‘ఆయ్’ సినిమా గురించి పోస్ట్ పెట్టారు. అవసరం ఉన్న ప్రతి చోట అల్లు అర్జున్ ముందుండి నడిపిస్తారు. ఒక స్నేహితుడికి కష్టమొస్తే.. తనకు ఎలా సపోర్ట్ చేయాలని ఆలోచించే ఏకైక వ్యక్తి అల్లు అర్జున్’ అంటూ ఐకాన్ స్టార్‌కు తనకు మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ బన్నీ వాసు కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.