హలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు తిరిగి ప్రయాణం అవుతున్న ప్రియాంక చోప్రా..

by Kavitha |   ( Updated:2024-03-25 05:50:48.0  )
హలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు తిరిగి ప్రయాణం అవుతున్న ప్రియాంక చోప్రా..
X

దిశ, సినిమా: హాలీవుడ్‌లో సత్తా చాటుకున్న భారతీయ నటీనటుల్లో ప్రియాంక చోప్రా ఒకరు. ఆమె అక్కడ నటించిన సినిమాలు, టీవీ షోలు కలిపి తక్కువ సంఖ్యలోనే ఉన్న కానీ,హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకుని బిడ్డను కూడా కన్న ప్రియాంక.. హాలీవుడ్‌కే పరిమితం అయింది. సెటిల్ అయితే అయింది కానీ తరచూ ఇండియన్ సినిమాలను విదేశాలలో తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మధ్య ఒక అంతర్జాతీయ సినీ వేడుకలో తనను ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయికి భారతీయ సినిమాల్లో డ్యాన్సులు ఎలా ఉంటాయో చూపిస్తూ.. ఇండియన్ సినిమాలంటే నడుము.. ఎదభాగమే అని పేర్కొంటూ స్టెప్‌లేసి కించపరిచింది. అలాగే కొన్ని గ్యాంగ్స్ వల్ల తాను బాలీవుడ్‌ను వదిలి హాలీవుడ్‌కు వెళ్లిపోవాల్సి వచ్చిందని కూడా పేర్కొంది ప్రియాంక.

కానీ తాజా సమాచారం ప్రకారం త్వరలోనే బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తుంది. హిందీ లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ కొత్త చిత్రంలో ప్రియాంక నటించనుందట. ఆయన కథలో ఓ పాత్రకు ఆమె ఓకే చెప్పిందట. బన్సాలీతో ఇప్పటికే ‘బాజీరావు మస్తానీ’ సినిమా తీసింది ప్రియాంక. ఇక ఆయన పై ఆమెకు అమితమైన గౌరవముంది. అందుకే బన్సాలీ కాబట్టి మళ్లీ హిందీ సినిమా చేయడానికి ఓకే అన్నట్లు తెలుస్తోంది. మరి ఇంతకుముందు బాలీవుడ్‌ను తక్కువ చేసి మాట్లాడిన ప్రియాంక పట్ల ఇండస్ట్రీ, ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

Next Story