Priyanka Chopra: అతనితో డేటింగ్ చేయాలంటే భయమేసింది.. ప్రియాంక

by Prasanna |   ( Updated:2023-03-31 08:29:50.0  )
Priyanka Chopra: అతనితో డేటింగ్ చేయాలంటే భయమేసింది.. ప్రియాంక
X

దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌తో రిలేషన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె నటించిన ‘సిటడెల్’ వెబ్‌సిరీస్‌ ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నటి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నిక్‌తో నాకు మొదట పరిచయమైనప్పుడూ అతనితో డేటింగ్ చేయొద్దనుకున్నా. ఎందుకంటే.. అప్పటికే నాకు 36 ఏళ్లు. నాకు పిల్లలు కావాలి. అతనికి కేవలం 26 ఏళ్లు మాత్రమే. ఆ వయస్సులో పిల్లలంటే ఎంత ఇష్టమున్నప్పటికీ.. అతనికి కెరీర్ మీద మాత్రమే దృష్టి ఉండేది. అలాంటప్పుడు అతను పిల్లలు కనడానికి ఇష్టపడతాడా లేదా అనే అనుమానం ఉండేది. కానీ.. నాకు పిల్లలంటే చాలా ఇష్టమని తను అర్థం చేసుకున్నాడు. పెద్దవాళ్లకంటే పిల్లలతో గడపడానికి ఎక్కువ ఇష్టపడతాను. అందుకే నిక్‌తో డేటింగ్ చేయడానికి చాలా ఆలోచించాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి: చరణ్ కాదన్నా గ్లోబల్ స్టార్ నువ్వే.. మంచు విష్ణుపై సెటైర్లు! మళ్లీ ఏం చేసాడంటే?

Advertisement

Next Story