ప్లేట్ మార్చిన యాంకర్ శ్యామల..పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్ అంటూ బిగ్ షాక్?

by Jakkula Samataha |   ( Updated:2024-05-12 14:40:36.0  )
ప్లేట్ మార్చిన యాంకర్ శ్యామల..పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్ అంటూ బిగ్ షాక్?
X

దిశ, సినిమా: యాంకర్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఎన్నో షోలకు హోస్ట్‌గా చేయడమే కాకుండా చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ మధ్య శ్యామల పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో రాజకీయవేడి రాజుకుంది. ఎంతో మంది సినీనటీనటులు ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ ఇస్తున్నారు. కానీ యాంకర్ శ్యామల మాత్రం వైసీపీలోకి అడుగు పెట్టి, సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి, ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ నటి పవన్ కళ్యాణ్‌ను చాలా ఘోరంగా అవమానించింది. దీంతో ఈ బ్యూటీ పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు గురి అవుతుంది. అయితే తాజాగా యాంకర్ శ్యామలకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అందులో శ్యామల మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. నిజానికి నేను ఆయనకు అంత పెద్ద ఫ్యాన్ కాదు. కానీ ఆయన చేసిన మంచి పనులు, చారిటీ కార్యక్రమాలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తనకు నేను వీరాభిమానిని అయిపోయాను. ఆయన క్యారెక్టర్‌కు నేను పెద్ద ఫ్యాన్.. అలాంటి గొప్పవ్యక్తి రాజకియాల్లోకి ఎంట్రీ ఇవ్వడం చాలా మంచి విషయం అని చెప్పుకొచ్చింది. ఇక అప్పుడు ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఆమె గతంలో అలా పొగిడి.. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ డబ్బు కోసం ఏమైనా చేస్తాడు.. తాను ట్రెండ్ ఫాలో అవ్వడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి అంటూ చాలా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యాఖ్యలకు ప్రముఖ సినీ నటులు శ్యామలకు కౌంటర్ ఇచ్చారు.

Read More..

పవన్ కల్యాణ్‌కు వింత పరిస్థితి..తన ఓటు తనకు వేసుకోలేకపోతున్న జనసేన చీఫ్..!

Advertisement

Next Story