Mamitha Baiju: తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ప్రేమలు బ్యూటీ.. ఆ హీరోకు జోడీగా..

by Kavitha |
Mamitha Baiju: తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ప్రేమలు బ్యూటీ.. ఆ హీరోకు జోడీగా..
X

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ మమిత బైజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె మలయాళంలో ఎన్నో సినిమాలు చేసిన రాని గుర్తింపు తెలుగులో వచ్చిన ‘ప్రేమలు’ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ అందుకుంది. ఈమె నటనకు దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఫిదా అయ్యారు. అలాగే తన అందం, అభినయంతో తెలుగు కుర్రాళ్ల మనసు గెలుచుకుంది. చేసింది ఒక్క సినిమానే అయినా ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. వేరే భాషల్లో కూడా ఇప్పుడిప్పుడే అవకాశాలు తెచ్చుకుంటుంది. ఈ క్రమంలోనే మమిత తెలుగులో నటించే ఛాన్స్ కొట్టేసిందట. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ అమ్మడిని తెలుగు ఇండస్ట్రీలో తీసుకురానుందట. లవ్ టుడే ఫెమ్ ప్రదీప్ రంగనాథన్‌తో మైత్రి మేకర్స్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో మమిత బైజు హీరోయిన్‌గా చేస్తుందని టాక్. మరి నిజమో కాదో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే.

Advertisement

Next Story