సొంత ఊర్లో పశువుల కాపరినే.. కట్టెల పొయ్యి మీదే మా వంట..

by Prasanna |   ( Updated:2023-05-14 08:32:09.0  )
సొంత ఊర్లో పశువుల కాపరినే.. కట్టెల పొయ్యి మీదే మా వంట..
X

దిశ, సినిమా : సొట్ట బుగ్గల చిన్నది ప్రీతి జింటా సిమ్లాలోని తన సొంత ఇంటికి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ అభిమానులతో పంచుకుంది. అంతేకాదు అక్కడికెళ్లిన ప్రతిసారి పశువులు, కోళ్లతో సరదాగా గడుపుతూ ప్రకృతిని ఆస్వాదిస్తానన్న నటి.. ఇంటిలో సాంప్రదాయ చుల్హా (చిన్న మట్టి పొయ్యి) వెలిగిస్తున్న చిత్రాలను షేర్ చేసింది. ‘పాత జ్ఞాపకాలతో మళ్లీ జీవించడం.. కొత్తగా వాటిని సృష్టించడం. చర్య అంతా పహాడీ ఇళ్లలోని వంటగది చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ నేను మంటలను వెలిగించడానికి.. అరుదుగా ఉపయోగించే పాత చుల్హాకు జీవం పోయడానికి ప్రయత్నిస్తున్నాను’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌లో అందంగా కనిపిస్తున్న ప్రీతిని ‘మిమ్మల్ని ఇలా చూడటం చాలా బాగుంది. మీరు ఎక్కడికి వెళ్లినా మీ మూలాల గురించి ఎప్పుడూ గర్వంగా చెబుతారు’ అని పొగిడేస్తున్నారు నెటిజన్స్.

Read more:

శింబుకు జోడీగా దీపిక? కమల్ హాసన్ మాట వింటుందా?

Advertisement

Next Story

Most Viewed