నీకు కొంచెమైనా సిగ్గనిపించడం లేదా? ప్రీతి ప్రవర్తనపై నెటిజన్లు ఫైర్

by Aamani |   ( Updated:2023-05-19 13:23:08.0  )
నీకు కొంచెమైనా సిగ్గనిపించడం లేదా? ప్రీతి ప్రవర్తనపై నెటిజన్లు ఫైర్
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. కనీసం దయ, కరుణ లేని మనిషి అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. విషయానికొస్తే.. ఇటీవల వీల్‌చైర్‌లో కూర్చుని రోడ్డుపై భిక్షాటన చేస్తున్న ఓ వికలాంగుడు ప్రీతి జింటాను సాయం చేయమని అర్థించాడు. కానీ, ఆమె ఫ్లైట్‌ టైమ్‌ అవుతోందంటూ సారీ చెప్పి కార్‌ ఎక్కేసింది. అతడేమో ఆమె కారు వైపే వీల్‌చైర్‌ తోసుకుంటూ వెళ్తూ.. ‘ప్లీజ్‌ మేడమ్‌ ప్లీజ్‌’ అంటూ ఆర్తిగా అడిగాడు. అయినా ప్రీతి పట్టించుకోకుండా వెళ్లిపోయిన వీడియో నెట్టింట వైరల్‌ అయింది. దీంతో నటి ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. ‘రూ.100ల కోట్ల ఆస్తులున్నా.. కనీసం నీవు వంద రూపాయలు కూడా ఇవ్వలేవా? కొంచెమైనా సిగ్గనిపించడం లేదా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story