తెలుగు అమ్మాయిని కావడమే నాకు ప్లస్‌.. ఇతర భాషల వారికి అది ఉండదు

by samatah |   ( Updated:2023-07-27 07:33:42.0  )
తెలుగు అమ్మాయిని కావడమే నాకు ప్లస్‌.. ఇతర భాషల వారికి అది ఉండదు
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ ప్రణవి మానుకొండ లోకల్ అమ్మాయిల టాలెంట్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’. సంజయ్‌ రావు హీరోగా నటించిన ఈ చిత్రానికి ఏఆర్‌ శ్రీధర్‌ దర్శకత్వం వహించగా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘తెలుగు అమ్మాయిని కావడం ప్లస్‌గానే భావిస్తా. మనకు వుండే నేటివిటీ మన వాళ్లకే వుంటుంది. పక్క భాషల నుంచి వచ్చే వారికి ఉండదు’ అని చెప్పింది. అలాగే ‘నాకు చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం. అనుష్క ‘అరుంధతి’లోని డైలాగ్స్‌ అద్దం ముందు నిలబడి చెప్పేదాన్ని. అమ్మ నాన్న కూడా ప్రోత్సాహించారు. రోటిన్‌ లవ్‌స్టోరీ, ఉయ్యాల జంపాల చిత్రాలతో గుర్తింపు వచ్చింది. ‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’ టైటిల్‌తో పాటు కథ, నేను చేసిన మౌనిక పాత్ర కూడా కొత్తగా ఉంటుంది. అన్ని రకాల ఎమోషన్స్‌ ఉంటాయి. ఇక క్యారెక్టర్ డిమాండ్‌ చేస్తే గ్లామర్‌ అయినా డీగ్లామర్‌గానైనా నటించేందుకు రెడీగా ఉన్నా’ అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది.

Advertisement

Next Story