- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'Pathan' సినిమా వివాదంపై Prakash Raj రీయాక్షన్ ఇదే..
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే కలిసి జంటగా నటించిన చిత్రం 'పఠాన్'. ఈ సినిమాకు ఆనంద్ సిద్దార్థ్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ చిత్రం రిలీజ్ కు ముందే పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇందులో నుండి ఇటీవల విడుదలైన 'బేషరమ్ రంగ్' పాటలో దీపికా డ్రెస్సింగ్‌పై ప్రముఖులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మధ్య ప్రదేశ్ హో మంత్రి, బీజేపీ సీనియర్ నేత, ఎంపీ ఇందులోని కొన్ని బోల్డ్ సీన్లు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పఠాన్ సినిమాను బాయ్ కాట్ చేయాలని నిరసనకారులు షారుఖ్, దీపికల దిష్టి బొమ్మలను దగ్దం చేశారు. ఈ వివాదాలపై టాలీవుడ్ సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ''బేషరం బిగోట్స్.. కాషాయం ధరించి రేపిస్టులను సత్కరిస్తే, ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే పర్వాలేదు. బ్రోకర్ ఎమ్మెల్యేలు, కాషాయ స్వామీజీలు మైనర్లపై అత్యాచారం చేసినా పట్టదు. కానీ ఒక సినిమాలో బోల్డ్ డ్రెస్ ధరించకూడదా? వురకనే అడుగుతున్నా.. ఇండోర్‌లో నిరసనకారులు దిష్టిబొమ్మలను తగులబెట్టారు. వారి డిమాండ్ 'పఠాన్'ను నిషేధించడమే'' అంటూ ఫైర్ అయ్యాడు.
#Besharam BIGOTS.. So it's okay when Saffron clad men garland rapists..give hate speech, broker MLAs, a Saffron clad swamiji rapes Minors, But not a DRESS in a film ?? #justasking ….Protesters Burn Effigies Of SRK In Indore. Their Demand: Ban 'Pathaan' https://t.co/00Wa982IU4
— Prakash Raj (@prakashraaj) December 15, ౨౦౨౨
Also Read....