రిచాకు మద్దతు.. అక్షయ్ కుమార్‌కు ప్రకాశ్ రాజ్ (Prakash Raj )కౌంటర్

by GSrikanth |   ( Updated:2022-12-15 07:08:00.0  )
రిచాకు మద్దతు.. అక్షయ్ కుమార్‌కు ప్రకాశ్ రాజ్ (Prakash Raj )కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దాపై రోజురోజుకూ విమర్శలు పెరిగిపోతున్నాయి. ఆమె దేశ సైనికులపై చేసిన ట్వీట్‌‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె క్షమాపణలు చెప్పినా నెటిజన్లు ఊరుకోవడం లేదు. అయితే, ఆమె ట్వీట్‌పై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. 'మీరు ఇలా మాట్లాడుతారని అసలు ఊహించలేదు. భారత సైన్యం ఉంది కాబట్టే మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం. మీరు చేసిన వ్యాఖ్యలు నన్ను బాగా హర్ట్ చేశాయి' అని వ్యాఖ్యానించారు. తాజాగా.. అక్షయ్ కుమార్ స్పందనపై నటుడు ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 'అక్షయ్ కుమార్ ఇలా ఆమెను తప్పుబడతారని అనుకోలేదు. రీచా చద్దాకు నేను సపోర్ట్‌గా నిలుస్తున్నాను.. ఆమె ఉద్దేశ్యం ఏంటో నాకు తెలుసు అంటూ ప్రకాష్‌ రాజ్‌ మద్దతుగా' అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. అంతేగాక ఆమె ఆర్మీకి వ్యతిరేకంగా చేసిన ట్వీట్‌ను ప్రకాశ్ రాజ్ సమర్థించాడు. కాగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ని వెనక్కి తీసుకునే విషయంలో ఎలాంటి ఆదేశాలనైనా అమలు చేసేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన ప్రకటనపై రిచా చద్దా బుధవారం స్పందించిన విషయం తెలిసింద

Read More: మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. చిక్కుల్లో రామ్‌దేవ్ బాబా

Read More: ప్రభాస్‌నే పెళ్లి చేసుకుంటా.. డేటింగ్ రూమర్స్‌పై కృతి

Advertisement

Next Story