బాలీవుడ్‌లో విలన్‌గా కరీంనగర్ కుర్రాడు

by Hajipasha |   ( Updated:2023-01-24 12:38:58.0  )
బాలీవుడ్‌లో విలన్‌గా కరీంనగర్ కుర్రాడు
X

దిశ, సినిమా: చిన్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ ఉన్న కరీంనగర్ కుర్రాడు ప్రజ్ఞన్ తన కలను సాకారం చేసుకునే దిశగా సాగుతున్నాడు. ఈ క్రమంలోనే పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ట్రెయిన్ అవుతూనే.. స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్ అండ్ ఫిలిమ్స్ పతాకంపై తెలుగు, హిందీలో 'కాలా బార్ బేరియన్ చాప్టర్ 1' సినిమా చేస్తున్నాడు. ఇందులో పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న విలన్ పాత్రలో కనిపించినట్లు తెలిపాడు. కాగా ఇందుకు సంబంధించిన పోస్టర్, ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకుడు ఎన్ . శంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రజ్ఞన్‌కు మంచి భవిష్యత్తు ఉందని ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి : నా భార్య ఇంటికి రానివ్వలేదు: హీరో

Advertisement

Next Story