Pragya jaiswal: స్టన్నింగ్ లుక్స్‌లో ప్రగ్యా జైస్వాల్.. బ్లాక్ ఇన్ గోల్డెన్ గర్ల్ అంటూ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-07-18 08:33:39.0  )
Pragya jaiswal: స్టన్నింగ్ లుక్స్‌లో ప్రగ్యా జైస్వాల్.. బ్లాక్ ఇన్ గోల్డెన్ గర్ల్ అంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కంచె’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ మంచి హిట్ కావడంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. నక్షత్రం, జయ జానకి నాయక, ఓం నమో వెంకటేశాయ, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే బాలకృష్ణ సరసన ‘అఖండ’ మూవీలో నటించి ఈ బ్యూటీ తన క్రేజ్ అమాంతం పెంచేసుకుంది. దీంతో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది అని అనడంలో అతియోశక్తి లేదు. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీ్వ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది.

తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని స్టైలీష్ లుక్‌లో స్టిల్స్ ఇచ్చింది. అది చూసిన నెటిజన్లు బ్లాక్ ఇన్ గోల్డెన్ గర్ల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.

(photo link credits to pragya jaiswal instagram id)

Advertisement

Next Story