నాలో మరో యాంగిల్ కూడా ఉందంటూ.. ఆ విషయంలో ప్రభాస్ రియాక్షన్ ఇదే..

by Javid Pasha |
నాలో మరో యాంగిల్ కూడా ఉందంటూ.. ఆ విషయంలో ప్రభాస్ రియాక్షన్ ఇదే..
X

దిశ, సినిమా : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 AD’ దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి నాగ్ అశ్విన దర్శకత్వం వహించారు. దీపికా పదుకొనే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలకపాత్రల్లో నటించారు. ఈ నెల 27న రిలీజ్ కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయి ఓ రేంజ్‌లో అమ్ముడుపోతున్నాయి. అయితే ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

వాస్తవానికి బాహుబలి మూవీ తర్వాత నార్త్‌లో కూడా పెద్ద ఎత్తున ఫేమ్ సంపాదించుకున్నాడు డార్లింగ్. ఇక ఆ తర్వాత నుంచి అన్నీ సీరియస్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు. దీంతో నార్త్ ఆడియన్స్‌కు ప్రభాస్‌లో నాటీనెస్, కామెడీ టైప్, లవ్ అండ్ రొమాంటికల్ యాంగిల్ ఉందనే విషయం తెలియదనే ఫీలింగ్ ఉందట. ఇదే ప్రశ్న ఎదురవగా.. డార్లింగ్ స్పందిస్తూ ‘నాలో ఆ యాంగిల్ కూడా ఉంది. కానీ నార్త్ ఆడియన్స్‌కి పెద్దగా తెలియదు’ అంటూ చెప్పుకొచ్చిన ప్రభాస్, కల్కి చిత్రంలోని తన పాత్రలో ఇలాంటి అన్ని షేడ్స్ ఉన్నాయని పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed