ప్రభాస్ ‘యోగి’ సినిమా రీ రిలీజ్.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే? (వీడియో)

by Hamsa |   ( Updated:2023-10-10 06:06:31.0  )
ప్రభాస్ ‘యోగి’ సినిమా రీ రిలీజ్.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, వీవీ వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘యోగి’. ఇందులో హీరోయిన్‌గా నయనతార నటించగా.. అలీ, సుబ్బరాజు, శారద, కోటా శ్రీనివాస రావు, ప్రదీప్ రావత్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2007లో వచ్చి డిజాస్టర్‌ పాలైంది. తాజాగా, ఈ సినిమా థియేటర్స్‌లో రీ రిలీజ్ అయింది. దీంతో మరోసారి ‘యోగి’ చూసిన ఫ్యాన్స్ తమ అభిప్రాయాలు తెలిపారు. ఒకప్పుడు ఫ్లాప్ అయిండొచ్చు ఇప్పుడు మామూల్‌గా ఉండదు. ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసే మొగోడు ఇంకా పుట్టలేదు అంటూ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. అలాగే సినిమా థియేటర్స్ ఫ్యాన్స్‌తో దద్దరిల్లిపోయినట్టు సమాచారం. ఈ సారి హిట్ అయ్యేటట్టు గా కనిపిస్తుంది.

Advertisement

Next Story