విదేశాలకు బయల్దేరిన ప్రభాస్.. అనారోగ్య సమస్యలే కారణమా?

by samatah |
విదేశాలకు బయల్దేరిన ప్రభాస్..  అనారోగ్య సమస్యలే కారణమా?
X

దిశ, వెబ్‌డెస్క్ : రెబల్ స్టార్ గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. బహుబళి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ఈ హీరో ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో మరో పాన్ ఇండియా మూవీ ఆది పురుష్ విడుదలకాబోతుంది.

ఇక కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఆయన షూటింగ్‌కు హాజరుకావడం లేదంట. షూటింగ్ బంద్ చేసి విదేశాలకు వెళ్తున్నాడంట. అయితే ప్రభాస్ షూటింగ్‌లకు హాజరు కాకపోవడానికి కారణం ఉందటున్నారు ఆయన అభిమానులు. గత కొన్ని రోజుల నుంచి ప్రభాస్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు, అందుకోసమే హెల్త్ చెకప్ కోసం విదేశాలకు వెళ్తున్నాడంటూ చెప్పుకొస్తున్నారు. మరికొందరు, గతంలో ప్రభాస్ కి మోకాలి సర్జరీ అయిందని, అందుకే మళ్ళీ వెళ్ళాడు అంటూ కొన్ని వార్తలు ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే విదేశాలకు వెళ్తున్నారని ముచ్చటిస్తున్నారు.

Advertisement

Next Story