PRABHAS: ఆ హీరోయిన్‌తో బ్రేకప్ వల్లే పెళ్లికి దూరంగా ఉంటున్న ప్రభాస్.. ఇన్నాళ్లకు బయటపడ్డ సంచలన నిజం?

by Kavitha |   ( Updated:2024-08-03 06:27:17.0  )
PRABHAS: ఆ హీరోయిన్‌తో బ్రేకప్ వల్లే పెళ్లికి దూరంగా ఉంటున్న ప్రభాస్.. ఇన్నాళ్లకు బయటపడ్డ సంచలన నిజం?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం 'కల్కి' సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే మరో ఆరు చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే సినిమాల పరంగా విజయాలు సాధిస్తున్నప్పటికీ పెళ్లికి సంబంధించిన వార్త మాత్రం చెప్పడం లేదని అభిమానులు రుసరుసలాడుతున్నారు. పెళ్లిపై ఎన్నో సందర్భాల్లో విలేకరులు ప్రశ్నిస్తున్నప్పటికీ వాటి నుంచి ప్రభాస్ ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నా సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే ఆయన పెళ్లి పై ఎన్నో రకాల పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే.. వీటన్నిటికి బ్రేక్ పడేలా సీనియర్ జర్నలిస్ట్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది పేరున్న నటుల వ్యక్తిగత జీవితాలను దగ్గర నుంచి చూసిన ప్రముఖ సినీ జర్నలిస్ట్ ఈ మంచి రామారావు తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ ప్రభాస్‌కు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. “అనుష్కతో సాన్నిహిత్యం కన్నా ముందే హీరోయిన్ త్రిషతో ప్రభాస్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలు వచ్చాయి. వీరి కెమిస్ట్రీకి సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యేవి. అలా ఆ టైంలో వీరిద్దరు ప్రేమించుకున్నారు. అలాగే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. దానికోసం త్రిషతో నిశ్చితార్థం కొరకు వేలికి తొడిగించేందుకు అత్యంత ఖరీదైన ఉంగరాన్ని ప్రభాస్ కొనుగోలు చేశారు. అయితే, ఎవరూ ఊహించని రీతిలో వీరిద్దరూ విడిపోయారు. అలా విడిపోవడానికి కారణం త్రిషనే.

ఎందుకంటే తమిళ పరిశ్రమకు చెందిన ఓ హీరోతో త్రిష.. చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యేది. అంత సన్నిహితంగా ఉండటం ప్రభాస్‌కు నచ్చలేదు. ఇదే విషయమై త్రిషను మందలించారు. అయితే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎంతో కొంత స్వేచ్ఛ ఉండాలి అని అనుకునే త్రిష. ప్రభాస్ ఇలా మందలించడం ఆమెకు నచ్చలేదు. దీంతో తన స్వేచ్ఛకు భంగం వాటిల్లుతున్నట్లు భావించి ప్రభాస్‌కు బ్రేకప్ చెప్పేశారు. ఇక తన జీవితంలోకి వచ్చే అమ్మాయి అంత స్వేచ్ఛగా ఉంటే బాగుండదని డార్లింగ్ కూడా భావించి అప్పటి నుంచి తాను కూడా త్రిషకు దూరంగా ఉండటంతోపాటు పెళ్లికి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు అంటూ ఈ మంచి రామారావు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story