Rebal Star Prabhas కు సర్జరీ.. ఆందోళనలో అభిమానులు

by sudharani |   ( Updated:2023-09-11 16:08:50.0  )
Rebal Star Prabhas కు సర్జరీ.. ఆందోళనలో అభిమానులు
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. అయితే.. గత కొంత కాలంగా ప్రభాస్ మోకాలు నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ‘ఆదిపురుష్’ మూవీ ప్రమోషన్స్ సమయంలో కూడా ప్రభాస్ మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు సర్జరీ జరగబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారంలో ప్రభాస్‌కు సర్జరీ కానుందట. దీని కోసం ఆయన యూకే వెళ్లినట్లు సమాచారం. ఆపరేషన్ అనంతరం మరో 15 రోజులు ప్రభాస్ అక్కడే ఉండే అవకాశం ఉంది. ఇక, ఇక్కడకు వచ్చిన తర్వాత నెల రోజుల పాటు ఇంటిపట్టున ఉంటూ రెస్ట్ తీసుకోనున్నారట. ఇక ‘సలార్‌’కు సంబంధించిన పనులు పూర్తి కాగా.. ప్రమోషన్స్ పనులు పూర్తి కావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : చూడటానికి సింపుల్‌గా ఉన్నా.. ఉపాసన ధరించిన డ్రెస్ ఖరీదేంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Advertisement

Next Story