Salaar Movie: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ అనౌన్స్‌మెంట్.. సలార్ రిలీజ్ అప్పుడే

by Javid Pasha |   ( Updated:2022-08-19 08:14:21.0  )
Prabhas Starrer Salaar Movie to Release on sep 28, 2023
X

దిశ, వెబ్‌డెస్క్: Prabhas Starrer Salaar Movie to Release on sep 28, 2023| మోస్ట్ వెయింటింగ్ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ 'సలార్' పేరు ఖచ్చితంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బిగ్ అప్‌డేట్స్ ఏమీ రాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశగా ఉన్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు మూవీ యూనిట్ మంచి ఊపిచ్చే అప్‌డేట్ తెచ్చేసింది.

పాన్ ఇండియా స్టార్ ఫ్యాన్స్‌కు సలార్ మూవీ టీం బిగ్ అనౌన్స్‌మెంట్ అందించింది. 'సలార్' మూవీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28 థియేటర్లలో సందడి చేయనుందని అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు అదిరిపోయే పోస్టర్‌తో ట్విట్టర్ వేదికగా మూవీ టీం అనౌన్స్‌ చేసింది.

ఈ పోస్టర్‌లో ప్రభాస్ చాలా వైల్డ్‌ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. రెండు చేతుల్లో రెండు కత్తులాంటి ఆయుధాలు పట్టుకుని పక్కా ఫైట్ మూడ్‌లో ఉన్నాడు. ఈ పోస్టర్ చూస్తేనే సినిమాలో ఫైట్స్ నెవ్వర్ బిఫోర్‌లా ఉంటాయనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ బిగ్ అనౌన్స్‌మెంట్‌తో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: గ్లామర్ పాత్రలు బోర్ కొడుతున్నాయి.. కొత్త కథలు కావాలంటున్న తమన్నా

Advertisement

Next Story