ఇండియన్ బాక్సాఫీస్‌ను చీల్చిచెండాడుతోన్న ప్రభాస్.. రెండ్రోజుల్లో ఎంతంటే?

by GSrikanth |   ( Updated:2024-01-04 15:05:53.0  )
ఇండియన్ బాక్సాఫీస్‌ను చీల్చిచెండాడుతోన్న ప్రభాస్.. రెండ్రోజుల్లో ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం భారత బాక్సాఫీస్‌ను చీల్చిచెండాడుతోంది. ఐదేళ్ల తర్వాత తమ అభిమాన హీరోకు సరైన హిట్ పడటంతో ఫ్యాన్స్‌ అంతా థియేటర్లకు తండోపతండాలుగా వస్తున్నారు. విడుదలైన మొదటిరోజు రూ.178 కోట్లు సాధించిన ఈ చిత్రం.. రెండోరోజూ సత్తా చాటింది. శనివారం ఏకంగా రూ.117 కోట్లు రాబట్టింది. ఇవాళ మూడోరోజు ఆదివారం కావడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

రెండ్రోజుల్లోనే రూ.295 కోట్లు సాధించిన సలార్.. మూడ్రోజుల్లోనే నాలుగు వందల కోట్లు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించారు. జగపతిబాబు మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. కలెక్షన్లలో ఇదే జోరు కనిపిస్తే ఈజీగా ప్రభాస్ వెయ్యి కోట్లు కొట్టడం సులువే అనిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Read More..

పవన్ కల్యాణ్ అలాంటి వ్యక్తి అని తెలిసి ఆశ్చర్యపోయాను.. సలార్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement

Next Story