మూడ్రోజుల్లో రూ.402 కోట్లు.. బాక్సాఫీస్‌ వద్ద ప్రభాస్ ఊచకోత

by GSrikanth |   ( Updated:2024-01-04 15:05:00.0  )
మూడ్రోజుల్లో రూ.402 కోట్లు.. బాక్సాఫీస్‌ వద్ద ప్రభాస్ ఊచకోత
X

దిశ, వెబ్‌డెస్క్: బాక్సాఫీస్ వద్ద రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషన్ క్రేయేట్ చేస్తున్నాడు. సలార్ విడుదలైన నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.402 కోట్లు సాధించి ప్రభాస్ రేంజ్‌ ఏంటో బాక్సాఫీస్‌కు చూపించాడు. విడుదలైన మొదటి రోజు రూ.178 కోట్లు, రెండో రోజు రూ.117 కోట్లు, మూడో రోజు రూ.107 కోట్లు కొల్లగొట్టింది. కొన్నేళ్ల తర్వాత ప్రభాస్‌కు హిట్ పడటంతో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రం ఊజీగా వెయ్యి కోట్లు సాధించడం పక్కా అని విశ్లేషకులు భావిస్తున్నారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతి హాసన్, మరో కీలక పాత్రలో కన్నడ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు కూడా ముఖ్యమైన రోల్ ప్లే చేశారు.

Read More..

సలార్ పార్ట్-2 అద్భుతంగా ఉంటుంది.. ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

Next Story