Sreeleela : యంగ్ సెన్సేషనల్ హీరోయిన్‌ను రిజెక్ట్ చేసిన ప్రభాస్..!

by Anjali |   ( Updated:2024-03-20 13:51:10.0  )
Sreeleela : యంగ్ సెన్సేషనల్ హీరోయిన్‌ను రిజెక్ట్ చేసిన ప్రభాస్..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. టాలీవుడ్ యంగ్ హీరోల నుంచి సీనియర్ స్టార్ హీరో(బాలకృష్ణ, రవితేజ)ల సినిమాల్లో నటించి.. అతి తక్కువ సమయంలో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఇక ఈ బ్యూటీ డాన్స్ గురించైతే స్పెషల్ గా చెప్పనవసరం లేదు. శ్రీలీల వేసే ఒక్కొక్క స్టెప్పుకు నెటిజన్లు స్టన్ అయ్యారు. అయితే శ్రీలీల దగ్గరకు తమ సినిమాల్లో అవకాశం ఇస్తామని దర్శక, నిర్మాతలు క్యూ కట్టగా.. ఓ స్టార్ హీరో మాత్రం ఈ భామను రిజెక్ట్ చేశారట.

మరీ ఆ హీరో ఎవరని అనుకుంటున్నారా? మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఈయన సినిమాల విషయంలో బాగా స్ట్రిక్ట్ గా ఉంటాడు. ఒకరికి కథ చెప్పి మరొకరికి ఓకే చేయడం లాంటివి అస్సలు చేయడు. అయితే ఈ యంగ్ బ్యూటీని ‘ది రాజా సాబ్’ చిత్రంలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా పెట్టుకోవాలి అంటూ మారుతి గట్టిగా ఫిక్స్ అయ్యారట. కానీ హైట్ మ్యాచ్ అవ్వదని.. తన మూవీలో శ్రీలీల వద్దంటే వద్దని పట్టుపట్టారట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story