ఆ అమ్మాయిల వల్లే ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోవడం లేదా?

by samatah |   ( Updated:2023-03-20 06:47:13.0  )
ఆ అమ్మాయిల వల్లే ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోవడం లేదా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బహుబలితో రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ పాన్ ఇండియా హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈ హీరో పెళ్లికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది.

తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ అమ్మాయే అంటూ ఓ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే కృష్ణం రాజు చనిపోయిన తర్వాత ఆ ఇంటి బాధ్యతలన్నీ ప్రభాసే తీసుకున్నాడు. ఇక కృష్ణం రాజుకు ముగ్గురు కూతుర్లు, అయితే ఆ ముగ్గురు చెల్లెళ్లకు పెళ్లి చేయకుండా తాను చేసుకోనంటూ మొండి పట్టు మీద ఉన్నాడంట.

ఈ విషయంలో శ్యామలా దేవి మాత్రం ప్రభాస్‌ను కోప్పడుతున్నట్లు తెలుస్తుంది. నువ్వు పెళ్లి చేసుకుంటేనే చెల్లెళ్లకు కన్యాదానం చేయచ్చు, నువ్వు పెళ్లి చేసుకోనాన్న అంటూ బతిమిలాడుతుందంట. ప్రభాస్ మాత్రం వారికి పెళ్లి చేశాకే నేను పెళ్లి చేసుకుంటానంటూ చెప్పకనే చెప్పాడంట.అందువలన చెల్లెళ్ల కోసం ప్రభాస్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read..

నాగచైతన్య రెండో పెళ్లిని అడ్డుకుంటుంది ఎవరో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed