వెంకటేష్‌కు ఫ్లాప్ ఇచ్చిన సినిమాతో, హిట్ అందుకున్న ప్రభాస్.. ఇంతకీ అది ఏసినిమా అంటే?

by Jakkula Samataha |
వెంకటేష్‌కు ఫ్లాప్ ఇచ్చిన సినిమాతో, హిట్ అందుకున్న ప్రభాస్.. ఇంతకీ అది ఏసినిమా అంటే?
X

దిశ, సినిమా : చిత్ర పరిశ్రమలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథ మరొకరికి చెప్పడంతో ఆయన ఒకే చేసి హిట్ అందుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అలానే ఒక హీరో ఫ్లాప్ అందుకున్న స్టోరీతో మరో హీరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మన విక్టరీ వెంకటేష్ ప్లాప్ అందుకున్న సినిమాతో ప్రభాస్ మంచి హిట్ అందుకున్నాడు. ఇంతకీ అది ఏ సినిమా అనుకుంటున్నారా?

మన సీనియర్ హీరో వెంకటేష్ హిందీలో అనిల్ కపూర్ హీరోగా వచ్చిన తేజాబ్ సినిమాకు రీమేక్‌గా టూటౌన్ రెడీ సినిమా చేశాడు. దీనికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అందుకుంది. ఇదే సినిమా కథతోనే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ శోభన్ దర్శకత్వంలో వర్షం మూవీ చేశాడు. కాగా, ఈ సినిమా కథ దాదాపు టూ టౌన్ రౌడీ సినిమా కథనే పోలి ఉంటుంది. అలా ప్రభాస్ వెంకటేష్ సినిమా కథతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

Advertisement

Next Story