ప్రభాస్‌ అలా అడిగే సరికి.. వద్దు ప్లీజ్ అంటూనే వార్నింగ్ ఇచ్చిన శ్రీయా రెడ్డి

by sudharani |   ( Updated:2023-12-26 15:24:35.0  )
ప్రభాస్‌ అలా అడిగే సరికి.. వద్దు ప్లీజ్ అంటూనే వార్నింగ్ ఇచ్చిన శ్రీయా రెడ్డి
X

దిశ, సినిమా: ప్రభాస్ సినిమాల విషయం పక్కనపెడితే.. ఇక ఆయన తన చూట్టూ ఉన్న వారికి భోజనం పెట్టి చంపేస్తాడనే వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఏ సెలబ్రిటీ అయినా డార్లింగ్ గురించి చెప్పాల్సివస్తే అతను పెట్టే తిండి గురించే ముందుగా మాట్లాడుతారు. మొన్నటికి మొన్న ‘సలార్’ ఇంటర్వ్యూ సందర్భంగా పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం ప్రభాస్ పంపించిన భోజనం కోసం ఎక్స్‌ట్రా రూమ్ బుక్ చేసుకోవాల్సి వచ్చిందట. ఇదే విషయమై నటి శ్రీయా రెడ్డిని కూడా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా ‘సలార్’ షూటింగ్ టైంలో నాకు ఇష్టమైన ఆహారం ఏంటి? అని ప్రభాస్ అడిగాడు. నేను ఏమీ తిననని, డైట్ చేస్తానని, బాగా వర్కౌట్ కూడా చేస్తానని తెలిపాను. ఏదో ఒక పదార్థం పేరు చెప్పాలని ప్రభాస్ బలవంతం పెట్టడంతో స్వీట్స్ అంటే ఇష్టమని చెప్పా. అయితే స్వీట్స్ పంపిస్తాను అన్నారు ప్రభాస్. కానీ నేను ఈ సినిమా షూటింగ్‌లో ఉన్నన్ని రోజులు ఎలాంటి ఫుడ్ పంపించకండి ప్లీజ్’’ అంటూ అతడికి స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చానంటూ చెప్పుకొచ్చింది శ్రీయారెడ్డి.

Advertisement

Next Story