సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ప్రభాస్ కూతురు Pranushka.. పిక్స్ వైరల్

by Hamsa |   ( Updated:2023-10-06 07:33:52.0  )
సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ప్రభాస్ కూతురు Pranushka.. పిక్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే బ్యాచిలర్‌గా ఉన్నాడు. అయితే ప్రభాస్, అనుష్కలు బాహుబలి మూవీలో జంటగా నటించి సెపరేట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో అనుష్క స్పందించి వారి మధ్య కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ వారిద్దరి పెళ్లి వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇటీవల AI సహాయంతో ఫ్యాన్స్ ఏకంగా వారికి ఓ కొడుకు కూడా ఉన్నట్లు ఫొటోను క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేశారు.

తాజాగా, ప్రభాస్‌కు ఓ కూతురు కూడా పుట్టినట్లు ఫ్యాన్స్ కొన్ని ఫొటోలను రెడీ చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ సహాయం తీసుకోని అనుష్కతో ప్రభాస్ కి పెళ్లి చేసేశారు. అయితే పెళ్లితో మాత్రమే ఆగలేదు.. వారిద్దరికీ ఒక పాపను కూడా పుట్టించేశారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ పాప పేరు ప్రనుష్క అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టా ట్రెండింగ్‌లోకి ప్రభాస్, అనుష్కతో పాటు వాళ్ల కూతురు ఉన్న పిక్స్ ఉన్నాయి. ఇది చూసిన కొందరు ఇదేం క్రియేటివిటీ రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీమర్స్ మాత్రం ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తుండగా అవి చూసిన వారు నవ్వుతున్నారు.


Advertisement

Next Story

Most Viewed