Kalki: సినిమాతో సరికొత్త రికార్డు సృష్టించిన ప్రభాస్.. పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2024-07-18 10:42:46.0  )
Kalki: సినిమాతో సరికొత్త రికార్డు సృష్టించిన ప్రభాస్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: ఎక్కడ చూసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ఈ మూవీ రిలీజ్ అయి మూడు వారాలు అవుతున్నప్పటికీ ఎక్కడ చూసినా కల్కి మానియానే కొనసాగుతుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించాడు. అయితే ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో థియేటర్స్‌లో దూసుకుపోతుంది.

అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతూ బాక్సాఫీసు వల్ల సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ‘కల్కి’ రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డుతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, కల్కి సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. టికెట్స్ బుక్ చేసుకునే ఆన్లైన్ ప్లాట్ఫారమ్ బుక్ మై షోలో ఏ హీరో సాధించిన రికార్డును ప్రభాస్ సాధించాడు.

దేశవ్యాప్తంగా బుక్ మై షో ఆన్లైన్ ఫ్లాట్ ఫార్మ్‌లో మొత్తం ఇప్పటి వరకు ఒక కోటి రూ. 21 లక్షల 50 వేల టికెట్స్ అమ్ముడైనట్లు సమాచారం. ఇప్పటి వరకు ఏ సినిమా అత్యధికంగా బుక్ మై షోలో ఇన్ని టికెట్స్ బుక్ అవడం ఇదే మొదటిసారి అని టాక్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో కల్కి తో ప్రభాస్ ఇప్పటివరకు ఏ హీరో సాధించని సరికొత్త ఘనత తన సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ విషయం తెలిసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story