Anushka, Prabhas ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలో వీరి కాంబినేషన్‌లో సూపర్ మూవీ?

by samatah |   ( Updated:2023-08-02 04:05:25.0  )
Anushka, Prabhas ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలో వీరి కాంబినేషన్‌లో సూపర్ మూవీ?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రభాస్, అనుష్క జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఏ సినిమా వచ్చినా, సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక బహుబలి తర్వాత వీరి కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా లేదు. దీంతో వీరిద్దరు కలిసి మళ్లీ ఎప్పుడు వెండితెరపై కనిపిస్తారా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ జోడికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? మరోసారి ఈ జంట స్క్రీన్‌పై మెరవనుందనే వార్తలు వస్తున్నాయి. స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ త్వరలోనే ప్రభాస్‌తో ఓ సినిమా ప్లాన్‌ చేశారట. భారీ బడ్జెట్‌ మూవీగా దీన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. మైత్రీమూవీస్‌ మేకర్స్‌పై ఇది రానుందని టాక్‌.

Also Read: Vishwak Sen నో చెప్పిన సినిమా హిట్ అయింది.. గొడవపై క్లారిటీ ఇచ్చిన baby డైరెక్టర్‌

Advertisement

Next Story