PAWAN-MEGASTAR: పవన్ కల్యాణ్ సినిమాలో విలన్‌గా మెగాస్టారా? ఫ్యాన్స్‌కు భారీ షాక్

by Anjali |
PAWAN-MEGASTAR: పవన్ కల్యాణ్ సినిమాలో విలన్‌గా మెగాస్టారా? ఫ్యాన్స్‌కు భారీ షాక్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనసవరం లేదు. ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. పవన్ ఎన్నికలకు ముందు స్టార్ట్ చేసిన మూడు సినిమాల షూటింగ్ పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో దర్శక, నిర్మాతలు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు అభిమానులు ఓజీ, హరహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ నటించిన ఓ సినిమాలో విలన్‌గా మెగాస్టార్‌ను తీసుకోవాలనుకుంటున్నారంటూ నెట్టింట ఓ ఆసక్తికర న్యూస్ ట్రెండ్ అవుతోంది.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మామాంగమ్ చిత్ర ట్రైలర్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘2008 లో తెరకెక్కిన ‘జల్సా’ సినిమాలో బలమైన పాత్ర కోసం ముమ్మట్టిని సంప్రదించాను. కానీ ఆయన విలన్ రోల్‌ను సున్నితంగా రిజెక్ట్ చేశారు. నన్ను నేను చిరంజీవితో పోల్చుకున్నాను. కాగా ఇలాంటి పాత్ర కోసం నన్ను అడగడం సరైనదేనా? అని అడిగారు.’ అంటూ అరవింద్ చెప్పుకొచ్చారు. ఇక వార్త ప్రజెంట్ నెట్టింట వైరల్ అవ్వగా.. ఫ్యాన్స్ కూడా అల్లు అరవింద్ పై మండిపడుతున్నారు.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో నటించిన పాన్ ఇండియా స్టార్‌ను విలన్ పాత్రలో నటించమని అడుగడం కరెక్ట్ కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమాలో విలన్‌గా మెగాస్టారా? నెవెర్ అంటూ ఓ వైపు ఫైర్ అవుతూ మరోవైపు ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరు స్టార్స్‌తో సినిమా చేస్తే మామూలుగా ఉండదు. భారీ హిట్ కొడుతుందనే ఉద్దేశంతోనే అల్లు అరవింద్.. ముమ్మట్టిని అప్రోచ్ అయ్యారు అంటూ మరికొంతమంది పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story