పవర్ స్టార్ రాజకీయ భవిష్యత్‌పై సినీనటుడు సుమన్ హాట్ కామెంట్స్

by sudharani |   ( Updated:2023-03-22 15:42:08.0  )
పవర్ స్టార్ రాజకీయ భవిష్యత్‌పై సినీనటుడు సుమన్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విపరీతమైన అభిమానుల ఆదరణ ఉందని సినీనటుడు సుమన్ అన్నారు. బహుశా పవన్‌కు ఉన్న అభిమానులు ఇండస్ట్రీలో ఎవరికీ ఉండరని చెప్పుకొచ్చారు. అది పవన్ కల్యాణ్‌కు ఒక వరం అని చెప్పుకొచ్చారు. అయితే రాజకీయంగా పవన్ కల్యాణ్ భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుందని సుమన్ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆల్ ఇండియా సుమన్ యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటుచేసిన 2023 సంవత్సర క్యాలెండర్‌ను నటుడు సుమన్ ఆవిష్కరించారు.

అనంతరం తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిణామాలపై సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు సుమన్ తెలిపారు. బెంగళూరుకు ధీటుగా తెలంగాణలో ఐటీరంగం అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో ఐటీ రంగంలో బెంగళూరును కూడా వెనక్కి నెట్టి ప్రపంచ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది దిశగా దూసుకుపోతోందని... ఆ అభివృద్ధికి తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సినీనటుడు సుమన్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

Bholashankar: ఉగాది సందర్భంగా.. ‘భోళాశంకర్’ నుంచి బిగ్ అప్‌డేట్

Advertisement

Next Story