గుంటూరు కారం : మహేష్ బాబు ఎంట్రీ సీన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by sudharani |   ( Updated:2023-11-18 10:48:41.0  )
గుంటూరు కారం : మహేష్ బాబు ఎంట్రీ సీన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ కాగా.. ఇక బ్యాలెన్స్ షూట్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంతకు ముందు పవన్ చిత్రాలకి మహేష్ వాయిస్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ‘గుంటూరు కారం’ మూవీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించనున్నారు అనే వార్త కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. ఇక తాజా సమాచారం ప్రకారం నిజంగానే మహేష్ కోసం పవర్ స్టార్ తన వాయిస్ అందించారని.. మహేష్ బాబు ఎంట్రీ సీన్‌తో పాటు పలు కీలక సన్నివేశాలకు పవన్ అందించిన వాయిస్ ఓవర్ అదిరిపోనుందని అంటున్నారు.

కాగా దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా మీనాక్షీ చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ మూవీలో.. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాశ్ రాజ్ ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్. రాధాకృష్ణ మూవీని నిర్మించనున్నారు.

Advertisement

Next Story