20 రోజులకి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవర్ స్టార్.. ఏ సినిమాకో తెలుసా..!

by Hamsa |   ( Updated:2023-02-24 03:43:58.0  )
20 రోజులకి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవర్ స్టార్.. ఏ సినిమాకో తెలుసా..!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తున్నా పవర్ స్టార్.. దీంతో పాటు మరో మూడు చిత్రాలను లైన్‌లో పెట్టారు. ఇక ఇన్ని సినిమాలు లైన్‌లో ఉండగానే.. పవన్ కల్యాణ్ మరో మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా, తమిళంలో సముద్రఖని నటించిన 'వినోదయ సీతం' సినిమాకు రీమేక్‌గా రాబోతుంది. ఇందులో సాయిధరమ్ తేజ్, కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఓ కీలక పాత్రలో నటిస్తునట్టు ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ కల్యాణ్‌ 20 రోజులు కేటాయిస్తున్నారని సమాచారం.

అయితే.. కేవలం 20 రోజులకే పవన్ కళ్యాణ్ రూ. 80 కోట్ల పారితోషికం చిత్ర యూనిట్‌ను డిమాండ్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని చిత్రయూనిట్ కూడా దీనికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ లెక్కన చూస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక్కరోజు రెమ్యూనరేషన్ రూ. 4 కోట్లు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న జాబితాలో ముందుగా ప్రభాస్. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు ఉన్నారని తెలుస్తోంది.

Also Read...

Mahesh Babu: SSMB 28 టైటిల్ రివీల్ టైం ఎప్పుడంటే?

Advertisement

Next Story