పవర్ స్టార్ కోసం హీరో నిఖిల్ త్యాగం.. ఆకాశానికెత్తేస్తోన్న పవన్ ఫ్యాన్స్

by GSrikanth |   ( Updated:2022-08-31 05:25:38.0  )
పవర్ స్టార్ కోసం హీరో నిఖిల్ త్యాగం.. ఆకాశానికెత్తేస్తోన్న పవన్ ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోని హీరోల్లోనే పవన్ కల్యాణ్‌కు చాలామంది అభిమానులు ఉన్నారు. అలాంటి పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే హడావుడి మామూలుగా ఉండదు. విడుదల రోజు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆయన ప్లాప్ సినిమా కూడా మాగ్జిమం కలెక్ట్ చేసి వావ్ అనిపిస్తుంటుంది. తాజాగా.. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోరిక మేరకు సెప్టెంబర్ 1వ తేదీన జల్సా సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నాలుగువేల థియేటర్లలో విడుదలకు రంగం సిద్ధం చేశారు. అయితే, హైదరాబాద్‌లోని చాలా థియేటర్లలో నిఖిల్ కార్తికేయ-2 సినిమా అద్భుతంగా ప్రదర్శింపబడుతోంది. అయితే, పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కార్తికేయ-2 సినిమాను తీసివేసి జల్సా సినిమాను విడుదల చేయాలని స్వయంగా హీరో నిఖిల్ థియేటర్ల యాజమాన్యాలను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని దేవి 70mm థియేటర్ యజమానికి నిఖిల్ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా, హీరో నిఖిల్ పవన్ కల్యాణ్ అభిమాని కావడం గమనార్హం.

Also Read : గుడ్‌న్యూస్: పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్ విడుదల

Advertisement

Next Story