Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. అదిరిపోయిన కొత్త సినిమా టైటిల్!

by GSrikanth |   ( Updated:2023-04-29 14:50:29.0  )
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. అదిరిపోయిన కొత్త సినిమా టైటిల్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా స‌ముద్రఖ‌ని ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న సినిమా ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. మామ-అల్లుడు కలిసి నటిస్తోన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #PSPKSDT సినిమాకు ‘దేవుడే దిగి వచ్చిన’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరోసారి తమ అభిమాన హీరోను దేవుడితో పోల్చడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ కార్డ్ ఫొటోలు ఎడిట్ చేసి ట్వి్ట్టర్ వేదికగా పోస్టు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను ఆగ‌స్ట్‌ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల‌నే యోచ‌న‌లో చిత్ర యూనిట్ ఉన్నట్లు ప్రచారం జ‌రుగుతోంది. జూలైలోగా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేయాల‌ని టార్గెట్‌ సెట్ చేసుకున్నట్లు చెబుతున్నారు.

Also Read: పవన్ కల్యాణ్‌ను అడ్డంగా బుక్ చేయనున్న రేణు దేశాయ్.. ‘కమింగ్ సూన్’ అంటూ సంచలన వీడియో

Advertisement

Next Story