నా లవ్వూ పోయింది.. లైఫ్ పోయింది: పోసాని కృష్ణ మురళి ఎమోషనల్

by Javid Pasha |
నా లవ్వూ పోయింది.. లైఫ్ పోయింది: పోసాని కృష్ణ మురళి ఎమోషనల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి తన బాధలు చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఇటీవల ఓ సమావేశంలో తన వ్యక్తిగత విషయాలు, కెరీర్ గురించి ఓపెన్‌గా మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. 'నేను బాగా చదువుకున్నా. అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలనుకున్నా. ఉద్యోగం సంపాదిస్తాననే కారణంగా చాలా పెళ్లి సంబంధాలొచ్చాయి. కానీ, కొంతమంది కావాలనే నన్ను బ్యాడ్ బాయ్‌గా క్రియేట్ చేస్తూ క్యాన్సిల్ చేయించారు. ఒక సంబంధం ఓకే అయిన తర్వాత కూడా పెళ్లి జరగకుండా చేశారు. దీంతో నా లవ్వూ పోయింది. నా లైఫ్ పోయింది.

ఎవరినీ ఏమీ చేయలేకపోయా. కానీ, కొన్నిసార్లు పుస్తకాల్లో కత్తి పెట్టుకుని తిరిగేవాడిని. అలాగే సగం కూలిపోయిన ఇంట్లోనే చాలా రోజులు గడిపాం. మా నాన్న పేకాట వల్ల నష్టపోయి పురుగుల మందుతాగి చనిపోయాడు. నాకెప్పుడూ ఏడుపు రాదు. కానీ ఇప్పుడు ఆగట్లేదు. మా అమ్మకు బంగారు గాజులు, నాన్నకు రింగ్ ఇవ్వాలనుకున్నా. నా కల తీరకుండానే చనిపోయారు' అంటూ ఎమోషనల్ అయ్యాడు.


Advertisement

Next Story