Posani: అదే జరిగితే నేను ఆత్మహత్య చేసుకుంటా.. పోసాని సంచలన వ్యాఖ్యలు..

by Indraja |   ( Updated:2024-05-11 14:45:06.0  )
Posani: అదే జరిగితే నేను ఆత్మహత్య చేసుకుంటా.. పోసాని సంచలన వ్యాఖ్యలు..
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం చర్చనీయాంసంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై పోసాని కృష్ణమురళి స్పందించారు. టైటిలింగ్‌ చట్టంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అందరూ అనుకుంటున్నట్టు పేదల భూములు లాక్కుంటే తాను విజయవాడలో ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు.

తన మాటలను నమ్మమి రానున్న ఎన్నికల్లో ఆలోచించి సరైన పార్టీకి ఓటు వేయమని పిలుపునిచ్చారు. వంశపార​పర్యంగా రైతులకు వచ్చే భూములు వారికి కాకుండాపోతాయా? అని ప్రశ్నించారు.

అసలు ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం అంటే ఏమిటి..?

వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితో పాటు పలు రకాలు భూములు ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఉన్నాయి. కాగా ఆ భూములకు సంబంధించిన రికార్డులు 30కి పైగా ఉన్నాయి. అయితే ఆ రికార్డులు ఎప్పుడో బ్రిటీష్‌ వారు మన దేశాన్ని పాలించిన కాలంనాటివి. ఈ నేపథ్యంలో రికార్డులను సరిచేసేందుకు తీసుకువచ్చిందే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం.

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం వల్ల లాభం ఏంటి..?

భూమిపై పక్కా యాజమాన్యపు హక్కు కల్పించి, వారి వారసులకు అందేలా చేయడమే ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ముఖ్య ఉద్దేశం అని అధికార పార్టీ చెబుతోంది.

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని ఎందుకు వద్దంటున్నారు.

గ్రామాల్లో భూమి ఎక్కువగా ఉంటుంది. పాసు బుక్కులు భూమి యజమాని పేరు పైన ఉన్నప్పటికీ పై అధికారుల రికార్డుల్లో వేరొకరి పేరు ఉన్న ఘటనలు గ్రామాల్లో కోకొల్లలు. సాధారణంగా భూములు ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తాయి. ఉదాహరణకి ఓ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్లిద్దరూ భూములు పంచుకున్నారు. అయితే వాళ్లిద్దరిలో ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఆ పిల్లలు మళ్ళీ తమ తమ తండ్రుల ఆస్తులను పంచుకుంటారు. ఇలా తరాలు మారాయి, బంధాలు, భంధుత్వాలు దూరమైయ్యాయి, కానీ ఇంటి పేరు మాత్రం అలానే ఉంటుంది. ఇక అతను ఆ భూమిని వేరొకరికి అమ్మి రిజిస్టర్ చేసినా అది కొందరి విషయంలో మండల ఆఫీసుల వరకే పరిమితం అయ్యింది. ఇప్పుడు ఏవైతే రికార్డులు సరిచెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ రికార్డులు సరిచేసే సమయంలో అసలు యజమాని పేరుకు బదులు వేరే వాళ్ల పేరు ఉండే అవకాశం కూడా ఉంది. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం అమలు జరిగితే అసలు యజమానుల్లో కొందరు నష్టపోయే అవకాశం ఉంది. అందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని వద్దంటున్నారు.

Read More..

ఏపీలో ‘పుష్ప’ సీన్ రిపీట్.. యాక్సిడెంట్ కావడంతో బాగోతం బట్ట బయలు

Advertisement

Next Story