- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రముఖ గాయని పి.సుశీలకు అస్వస్థత
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గాయని పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా సుశీల తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. శనివారం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో భయాందోళన చెందిన కుటుంబసభ్యులు హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. దీంతో సుశీల అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సుశీల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిల్, కన్నడ, మళయాలం ఇలా అన్ని భాషల్లో రాణించారు. 2008లో ఆమెను భారత ప్రభుత్వం ప్రద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతోపాటు సుశీల కెరీర్లో ఐదు జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
Advertisement
Next Story