పూరీగాడి పని అయిపోయింది మామ.. నమ్ముకుంటే సంక నాకి పోతాం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్

by Hajipasha |   ( Updated:2022-08-30 09:34:29.0  )
పూరీగాడి పని అయిపోయింది మామ.. నమ్ముకుంటే సంక నాకి పోతాం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కు ఓ అభిమాని షాకిచ్చాడు. ఇటీవల ఆయన తెరకెక్కించిన 'లైగర్' దారుణంగా పరాజయం పాలవడంతో మనస్తాపం చెందిన యువకుడు.. పూరిని తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలని హార్ట్ ఫుల్ రిక్వెస్ట్ చేస్తూ లెటర్ రాశాడు.

'పూరి... ముందుగా ఇలా మాట్లాడుతున్నందుకు ఐ యామ్ సారీ..

నేను నీ సినిమాలకు పెద్ద అభిమానిని. చాలా కాలంగా నేను 'లైగర్' సినిమా కోసం ఎదురుచూస్తున్నా. మొదటి రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా చూడలేకపోయాను. మొదటి రోజు సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. మా ఫ్రెండ్స్ అంతా 'సినిమా బాలేదు, మీ వాడి పని అయిపోయింది. 'ఇస్మార్ట్ శంకర్' అనుకోకుండా వచ్చిన హిట్టు అని రకరకాల విమర్శలు చేశారు. అయినా నేనేమీ పట్టించుకోలేదు. ఒక్క రివ్యూ కూడా చదవకుండా నేను ఆదివారం రోజున థియేటర్‌కు వెళ్లి సినిమా చూశాను. నాతో పాటు ఎవ్వరినీ తీసుకెళ్లలేదు. నేను సినిమా ఫోకస్డ్‌గా చూడాలి. నీ సినిమాల్లో ఉండే ఫిలాసఫీ‌ని అర్థం చేసుకోవాలి అనేది నా ప్రధాన ఉద్దేశం. అలాగే వెళ్లాను. సినిమా చూశాను. సినిమా ఫ్లాప్ అయినందుకు, ఫ్రెండ్స్ బాలేదు అన్నందుకు నేను ఏమాత్రం బాధపడలేదు. ఏ దర్శకుడికి అయినా హిట్స్ ఫ్లాప్స్ అనేవి కామన్. కాకపోతే నేను బాధపడిందల్లా.. నాకు తెలిసిన పూరి మార్క్, నేను ఎంజాయ్ చేసే పూరి టేకింగ్.. ఈ సినిమాలో కనిపించలేదు. 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రాన్ని ఎవరో బాలీవుడ్ డైరెక్టర్ రీమేక్ చేసి.. మళ్లీ దాన్ని తెలుగులోకి డబ్ చేసినట్టు ఉంది సినిమా. నీ మార్క్ ఎలా మిస్ అయింది పూరి?'

'గోలీమార్'లో ఓ మంచి డైలాగ్ రాశావు. '10 మందిని మోసం చేస్తే నువ్వు కనీసం బాగుపడతావ్, నిన్ను నువ్వు మోసం చేసుకుంటే సంక నాకి పోతావ్' అని..! నా కర్మ నువ్వు రాసిన డైలాగ్ నేను నీకు గుర్తు చేయాల్సి వస్తుంది. అర్జెంట్‌గా నీ టీమ్‌ను మార్చెయ్. లేదంటే వాళ్లను నిజాలు చెప్పమని చెప్పు. అవును అంటే అవును.. కాదు అంటే కాదు... బాగుంటే బాగుంది.. బాలేదు అంటే బాలేదు.. అని చెప్పమను. నీ సినిమాలు ఫ్లాప్ అయినా వాటికి, నీకు ఓ రెస్పెక్ట్ ఉంటుంది పూరి. 'లైగర్' సినిమాకి అది దక్కలేదు అని నా బాధ.

నువ్వు తీసిన 'రోగ్' సినిమా చూసినప్పుడు కూడా నాకు ఇంత ఇబ్బంది కలగలేదు. 'లైగర్'తో చాలా డిజప్పాయింట్ చేశావ్. మొన్న సుకుమార్‌తో కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం గురించి చాలా బాగా చెప్పావు. కాదు కాదు గొప్పగా చెప్పావు. కానీ నువ్వెప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తావు? నువ్వు ఇప్పుడు పూర్తిగా కంఫర్ట్ జోన్‌లో ఉండిపోయావు తెలుసా? ఆ 'పూరి కనెక్ట్స్' నుంచి బయటకు వచ్చి ఓ సినిమా తియ్యి. ఇది నా హార్ట్ ఫుల్ రిక్వెస్ట్.

మాకు నువ్వు ప్రతీసారి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవ్వనవసరం లేదు. నాకు వింటేజ్ పూరిని చూపించు. కనీసం చూపించడానికి ట్రై చెయ్. ప్రతి సారి 'ఇడియట్', 'పోకిరి' అవసరం లేదు. కడుపు మండి 'బిజినెస్ మెన్' సినిమా తీశాను అని చెప్పావు కదా. నాకు కడుపు మండి ఇలాంటి లెటర్ రాస్తున్నాను. 'బిజినెస్ మెన్' లాంటి సినిమా ఒకటి ఇవ్వు.

Also Read : IMDB రేటింగ్‌లో "లైగర్" చెత్త రికార్డ్..

Advertisement

Next Story

Most Viewed