నాకు చాలా టార్గెట్స్ ఉన్నాయి.. కెరీర్ ప్లానింగ్‌పై పూజా

by Prasanna |   ( Updated:2023-04-18 07:33:32.0  )
నాకు చాలా టార్గెట్స్ ఉన్నాయి.. కెరీర్ ప్లానింగ్‌పై పూజా
X

దిశ, సినిమా: పూజా హెగ్డే తన కెరీర్ ప్లానింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆమె నటించిన ‘కిసి కా భాయ్ కిసికి జాన్’ మూవీ ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా రీసెంట్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ గురించి మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ చేయాలంటే చాలా భయం. అందుకే మా అమ్మ నన్ను భరతనాట్యం నేర్చుకోమని చెబుతూ ఉండేది. ఇక సినిమాల విషయానికొస్తే చాలా టార్గెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నాకు మహిళలను చైతన్యవంతం చేసే పాత్రలో నటించాలని ఉంది. నాకు భాష గురించి పట్టింపు ఉండదు. మంచి కథ, క్యారెక్టర్ వస్తే వెంటనే ఓకే చెప్పేస్తా’ అంటూ వెల్లడించింది.

Read more:

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సెట్లోకి ‘OG’ ఎంట్రీ

‘#ఎన్టీఆర్ 30’ షూటింగ్‌లో జాయిన్ అయిన బాలీవుడ్ హీరో

Advertisement

Next Story