కేజీఎఫ్ స్టార్ యష్ పక్కన చాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే

by sudharani |
కేజీఎఫ్ స్టార్ యష్ పక్కన చాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే
X

దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్‌లో చాలా బిజీగా ఉంది. ఇటీవలే దళపతి విజయ్‌తో 'బీస్ట్' సినిమాలో కనిపించిన భామ.. ప్రస్తుతం మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న '#SSMB28'లో ఫిమేల్ లీడ్‌‌‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడుకు మరో బంపర్ ఆఫర్ దక్కిందని సమాచారం. 'కేజీఎఫ్'తో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన కన్నడ స్టార్ హీరో యష్‌‌తో సినిమాలు చేసేందుకు ఇప్పుడు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 'మఫ్టీ' ఫేమ్ నర్తన్ డైరెక్షన్‌లో తన తదుపరి సినిమా చేయబోతున్నాడు యష్. కాగా ఈ సినిమాలో యష్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది. పూజకు పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ఉన్నందున ఈ సినిమాకు తనే కరెక్ట్ అని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story