ఆఫ్టర్ లాంగ్ టైం.. సెట్‌లోకి అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్

by sudharani |   ( Updated:2024-03-19 11:31:18.0  )
ఆఫ్టర్ లాంగ్ టైం.. సెట్‌లోకి అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా: ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన బ్యూటీ పూజా హెద్దే. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో ఐరెన్ లెగ్ అనే బిరుదు కూడా తెచ్చుకుంది. దీంతో బాలీవుడ్‌కి మకాం మార్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ.. గతేడాది సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ అనే సినిమాతో పలకరించింది. ఇది కూడా ప్లాప్ అయినప్పటికీ బాలీవుడ్‌లో మాత్రం అవకాశాలు తగ్గలేదు. ఈ క్రమంలోనే తాజాగా మారో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పూజా.

ప్రస్తుతం పూజా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సరసన ‘దేవా’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. చలన చిత్ర నిర్మాత రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీని జీ స్టూడియోస్ అండ్ రాయ్ కపూర్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావడంతో.. చాన్నాళ్ల తర్వాత సెట్‌కి హాజరయిందట ఈ బ్యూటీ. ఈ విషయాన్ని నేరుగా తన అభిమానులతో పంచుకుంది బుట్టబొమ్మ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. ‘పూజా ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. కాగా.. బాలీవుడ్‌లో ‘దేవా’తో పాటు మరో సినిమాకు కూడా సంతకం చేసింది పూజా హెగ్డే.

Read More..

మంచు లక్ష్మి కాళ్లపై పడిన అభిమాని (వీడియో).. లక్ష ఇవ్వడం వల్లనా లేక సినిమాలు చేయకని అలా చేశాడా?

Advertisement

Next Story