బాలీవుడ్ ఇండస్ట్రీకి సపోర్టుగా నిలవాలి: Pooja Hegde

by sudharani |   ( Updated:2022-09-12 12:06:33.0  )
బాలీవుడ్ ఇండస్ట్రీకి సపోర్టుగా నిలవాలి: Pooja Hegde
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తను నటించిన హిందీ సినిమాల రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు ఈ సమయంలో బాలీవుడ్ పరిశ్రమకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. బెంగళూర్‌లో జరిగిన 'SIIMA' అవార్డ్ ఫంక్షన్‌కు హాజరైన బుట్టబొమ్మ పింక్ గౌనులో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన నటి.. 'ప్రస్తుతం మేము ప్రతీ విషయంలో సినీ పరిశ్రమకు సపోర్ట్ ఇవ్వాలి.

రెండు సంవత్సరాల తర్వాత రీసెంట్‌గా నటించిన బాలీవుడ్ చిత్రాలు 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్', 'సర్కస్' ఈ ఏడాది చివరలో విడుదలకానున్నాయి. ఈ రెండు నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తాయని నమ్ముతున్నా' అంటూ వివరించింది. ఇక ఈ ఈవెంట్‌లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'కు ఉత్తమ నటిగా, 'యూత్ ఐకాన్ సౌత్' ఫిమేల్‌గా రెండు 'SIIMA' ట్రోఫీలను గెలుచుకున్న బ్యూటీ.. ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలిపింది.

Advertisement

Next Story