- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి తెర మీదకు సమంత, నాగచైతన్య విడాకులు.. రాజకీయ నేతలపై ఫ్యాన్స్ ఫైర్ !
దిశ, సినిమా : అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటారు అని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా వీరు విడాకులు తీసుకొని తమ అభిమానులకు షాకిచ్చారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరి విడాకుల ఇష్యూపై అనేక రూమర్స్ వస్తున్నాయి. వీరు విడాకులు తీసుకొని సంవత్సరాలు గడిచిపోతున్నా.. ఈ డివోర్స్ ఇష్యూ అనేది రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు వీరి విడాకులపై రాజకీయనేతలు కూడా కలగజేసుకోవడంతో మరోసారి చర్చనీయాంశం అవుతుంది.
అయితే సమంత, నాగచైతన్య విడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్ కారణం అంటున్నారు కొందరు రాజకీయ నేతలు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతిపక్ష నాయకుల ఫోన్లతో పాటు, సెలబ్రిటీస్ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిందంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న సమంత, నాగచైతన్య విడిపోవడానికి ఫోన్ ట్యాపింగే కారణం అంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ తెర వెనుక ఉండి ఫోన్ ట్యాపింగ్ చేయించారు. దీని వలన సమంత, చైతూ డివోర్స్ తీసుకున్నారని చెప్పడంతో టాలీవుడ్ మొత్తం షాక్‌కు గురైంది. అయితే ఇప్పుడిప్పుడే ఆ ఇష్యూ మర్చిపోతున్న క్రమంలో మరో నాయకుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఏం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి దీని గురించి ఏం చేస్తున్నారు. దీని ద్వారానే బంగారం లాంటి జంట విడిపోయారు అంటూ ఆయన తెలిపారు. అంతే కాకుండా పలువురు నాయకులు కూడా సమంత, చైతన్య డివోర్స్ ఇష్యూ గురించి మాట్లాడటంతో అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడంలేదు.
దీంతో అటు అక్కినేని ఫ్యాన్స్, ఇటు సమంత ఫ్యాన్స్ అయోమయంలో పడి పోతున్నారు. అసలు వీరు విడిపోయింది ఎందుకో ఎవరికీ సరిగ్గా తెలియదు. కానీ కావాలనే పాపం వీరిని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోకి లాగి, తమ రాజకీయాల కోసం వీరిని వాడుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. ఈ కపుల్‌ని ఇలా ఆడుకుంటున్నారేంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులోకి వీరిని లాగడం కరెక్ట్ కాదు అంటూ ఫైర్ అవుతున్నారు. కాగా, దీనిపై ఇప్పటికీ అటు సమంత కానీ, ఇటు చైతన్య కానీ స్పందించలేదు.