PM Modi Vs Katrina Kaif : ప్రధాని మోడీ కంటే కత్రినా కైఫ్‌నే టాప్.. పీఎంను కాదని ఆమె వెంటే..!

by sudharani |   ( Updated:2023-09-26 13:05:20.0  )
PM Modi Vs Katrina Kaif : ప్రధాని మోడీ కంటే కత్రినా కైఫ్‌నే టాప్.. పీఎంను కాదని ఆమె వెంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా ఎంతో డెవలప్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ట్వీట్టర్ వంటి వాటిల్లో మొన్నటి వరకు ఎవరికి ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారో తెలిసేది. దీంతో ఏ సెలబ్రెటీకి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో తెలిసిపోయేది. ఈ క్రమంలోనే ఇప్పుడు వాట్సాప్‌లో కూడా పోటీపడుతున్నారు ప్రముఖులు. వాట్సాప్ నూతనంగా వాట్సాప్ చానెల్‌ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది సెలబ్రెటీల ఇప్పుడు వాట్సాప్ చానెల్స్‌లో కూడా పోటీ పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వారిలో కత్రినా కైఫ్ 13.5 మిలియన్ ఫాలోవర్స్‌తో ప్రథమ స్థానంలో ఉండగా.. ఇండియా క్రికెట్ టీమ్ (8.7 Millions), అక్షయ్ కుమార్ (7.6m), న్యూస్ 18 ఇండియా (7.2m) ఉంది. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ 6 మినియన్ల ఫాలోవర్స్‌తో ఐదో స్థానంలో ఉన్నారు. కాగా, పీఎం మోడీ కంటే బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కే ఎక్కువ మంది ఫాలో వర్స్ ఉండటం గమనార్హం.




Advertisement

Next Story