Renu Desai: ప్లీజ్ ఇది మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేసి నాకు సాయం చేయండంటూ రేణు దేశాయ్ పోస్ట్

by Hamsa |
Renu Desai: ప్లీజ్ ఇది మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేసి నాకు సాయం చేయండంటూ రేణు దేశాయ్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె గత కొద్ది రోజుల నుంచి అనాధ పిల్లలకు, జంతువులకు తనవంతు సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటుంది. అంతేకాకుండా అప్పుడు తాను ఇచ్చింది సరిపోకపోతే తన ఫాలోవర్స్‌కు కూడా అడిగి మరీ జంతువుల మంచి చెడులు చూసుకుంటుంది.

అలాగే తన పిల్లలు అకీరా, ఆద్యలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. కొన్ని సమాజంలో జరుగుతున్న విషయాలపై రియాక్ట్ అవుతూ పోస్ట్‌లు పెడుతుంది. ఈ క్రమంలో.. తాజాగా, రేణు దేశాయ్ ఓ ఆసక్తికర విషయం చెబుతూ సాయం కోరింది. ఓ కుక్క మిస్ అయి 2 డేస్ అవుతుంది. దీనిని తీసుకొని ఇచ్చిన వారికి రివార్డ్ రూ. 20,000 ఇస్తామని ప్రకటించింది. అంతేకాకుండా మీ పూణె ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి ఈ డాగ్ తెచ్చి ఇవ్వమని చెప్పి సహాయం చేయండి అనే విధంగా రాసుకొచ్చింది. ప్రజెంట్ రేణు దేశాయ్ పోస్ట్ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story