Vijay devarakonda: ఆ ఫొటో షేర్‌ చేయొద్దు ప్లీజ్‌ మీకు త్వరలోనే బిగ్ సర్ప్రైజ్ ఇస్తా అంటూ.. విజయ్ దేవరకొండ పోస్ట్

by Prasanna |   ( Updated:2024-07-24 13:00:45.0  )
Vijay devarakonda: ఆ ఫొటో షేర్‌ చేయొద్దు ప్లీజ్‌ మీకు త్వరలోనే బిగ్ సర్ప్రైజ్ ఇస్తా అంటూ.. విజయ్ దేవరకొండ పోస్ట్
X

దిశ, సినిమా : రౌడీ ట్యాగ్ తో బాగా ఫేమస్ అయినా విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ హీరోకి కష్ట కాలమే నడుస్తుంది. ఎందుకంటే, తీసిన సినిమా హిట్ అవ్వడం సంగతి పక్కన పెడితే పెట్టిన బడ్జెట్ కూడా వసూలు చేయలేకపోతోంది. ఇక , అలా కాదని మంచి కథ ఉన్న సినిమాలను మాత్రమే చేయాలని ఫిక్స్ అయ్యాడు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ ‘VD12’ వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. అక్కడ షూట్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వీటిపై స్పందించిన మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ విడుదల చేశారు. “డియర్ రౌడీ ఫ్యాన్స్ .. మీ ముందుకు మంచి కథని తీసుకురాబోతున్నాం దీనికోసం టీమ్ #VD12 కూడా చాలా శ్రమిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ 60 శాతం షూటింగ్ పూర్తి చేసాము. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నాము. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామంటూ " పోస్ట్ చేసారు. ఆ ఫొటో షేర్‌ చేయొద్దు ప్లీజ్‌ మీకు త్వరలోనే బిగ్ సర్ప్రైజ్ ఇస్తా అంటూ.. విజయ్ దేవరకొండ పోస్ట్ కూడా పెట్టాడు.

Advertisement

Next Story