Rajinikanth: సూపర్ స్టార్ ‘వెట్టైయాన్’ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌కు ప్లేస్‌ ఫిక్స్.. పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2024-09-17 12:22:38.0  )
Rajinikanth: సూపర్ స్టార్ ‘వెట్టైయాన్’ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌కు ప్లేస్‌ ఫిక్స్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ప్రజెంట్ తలైవా జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేల్ డైరెక్షన్‌లో ‘వెట్టైయాన్’ మూవీ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, అమితాబ్ బచ్చన్, దుషారా విజయన్, రితికా సింగ్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రావు రమేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది. అయితే వెట్టైయాన్ అక్టోబర్ 10న దసరా కానుకగా థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ఇటీవల క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో.. తాజాగా, వెట్టైయాన్ చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్, ప్రివ్యూ ఈవెంట్‌ చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 20న గ్రాండ్‌గా జరగనున్నట్లు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కాగా, రజినీకాంత్ మరొవైపు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘కూలీ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇందులో పలువురు సినీ స్టార్స్ కీలక పాత్రల్లో నటించనున్నట్టు పోస్టర్లను కూడా విడుదల చేశారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


Advertisement

Next Story