అక్కడి వాళ్లకు మహేశ్ బాబు భార్య ఎవరో తెలుసు కానీ ప్రభాస్ తెలియదు.. డార్లింగ్‌పై రానా కామెంట్స్ వైరల్

by Disha Web Desk 7 |
అక్కడి వాళ్లకు మహేశ్ బాబు భార్య ఎవరో తెలుసు కానీ ప్రభాస్ తెలియదు.. డార్లింగ్‌పై రానా కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలియని వాళ్లు ఉండరు. ‘వర్షం’ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈయన.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంతో వరల్డ్ వైడ్‌గా మన డార్లింగ్ పేరు మారుమోగింది. ఇప్పుడు ప్రభాస్‌కు సౌత్, నార్త్ అనే తేడాలేకుండా ఎక్కడపడితే అక్కడ డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.

అయితే టాలీవుడ్‌లో ‘వర్షం’, ‘ఛత్రపతి’ వంటి సినిమాలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ‘బాహుబలి’కి ముందు మాత్రం చాలా తక్కువ మందికి తెలుసట. అసలు ప్రభాస్ అంటే ఎవరూ అనే అడిగేవాళ్లు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు చెప్పుకొచ్చాడు రానా. ఆయన మాట్లాడుతూ.. ‘బాహుబలి సినిమా చేస్తున్న సమయంలోనే పని మీద బొంబాయికి వెళ్లాను. అప్పటికే నేను అక్కడ కొన్ని సినిమాలు చేయడంతో.. అక్కడి వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో త్వరలో బాహుబలి చేస్తున్నట్లు చెప్పాను.

బాహుబలిగా ఎవరు నటిస్తున్నారని అడిగారు. ప్రభాస్ అని చెప్పాను. వెంటనే ప్రభాస్ ఎవరూ? అని వాళ్లు అనే సరికి నేను షాక్ అయ్యాను. వాళ్లకు ఇప్పుడు ఎలా చెప్పాలి అని ఆలోచించుకుంటూ.. ‘ఛత్రపతి’, ‘మిర్చి’ చూశారా అని అడిగితే చూడలేదు అని చెప్పారు. కానీ చిరంజీవి, వెంకటేశ్ మాత్రమే తెలుసునని.. ఈ జనరేషన్ హీరోస్ గురించి అసలు తెలియదని చెప్పారు. ఇక నమ్రత భర్తగా మహేష్ బాబు తెలుసని వారు చెప్పేసరికి నా గుండెళ్లో గుణపం గుచ్చుకున్నట్లు అయింది’ అంటూ చెప్పుకొచ్చాడు రానా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Click Here For Twitter Post

Next Story

Most Viewed